తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్రిగోల్డ్​ భూములు వేలం - భూముల వేలం

మహబూబ్​నగర్​లో అగ్రిగోల్డ్​ సంస్థకు చెందిన వ్యవసాయ భూములకు అధికారులు వేలం నిర్వహించారు. ఫరూఖ్​నగర్​కు చెందిన నరేందర్​రెడ్డి టెండర్​ దక్కించుకున్నారు. నిబంధనలు ప్రకారం 33శాతం డబ్బులు చెల్లించకపోతే టెండర్​ రద్దవుతుంది.

హైకోర్టు

By

Published : Feb 24, 2019, 5:22 AM IST

అగ్రిగోల్డ్​ సంస్థ భూములు వేలం
హైకోర్టు ఆదేశాల మేరకు మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన వ్యవసాయ భూములకు శనివారం జిల్లా కలెక్టరేట్​లో వేలం నిర్వహించారు. జిల్లా పాలనాధికారి రోనాల్డ్ రోస్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్​ అరుణకుమారి, సంయుక్త కలెక్టర్, సంబంధిత అధికారుల సమక్షంలో వేలం వేయగా.. ఫరూఖ్​నగర్​కు చెందిన నరేందర్​రెడ్డి టెండర్ దక్కించుకున్నారు.
ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు
మహబూబ్​నగర్ జిల్లాలో అగ్రిగోల్డ్​కు సంబంధించిన 156.15 ఎకరాల భూములను పది కోట్ల రూపాయలకు వేలం వేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అందుకనుగుణంగా అధికారులు ఈనెల 1న టెండర్లు ఆహ్వానించారు. బాదేపల్లికి చెందిన ప్రశాంత్​రెడ్డి రూ.14.22 కోట్లకు వేలం పాడి.. నిబంధనల ప్రకారం డబ్బు చెల్లించలేకపోయారు. ఫలితంగా జిల్లాస్థాయి కమిటీ టెండర్​ను​ రద్దు చేసింది. ఈనెల 7న మరోసారి నోటిఫికేషన్​ విడుదల చేసి శనివారం వేలం నిర్వహించారు. రూ.15.18 కోట్లకు భూములను దక్కించుకున్న నరేందర్​రెడ్డి ఇప్పటికే ధరావతు కింద రూ.14.25 లక్షలు చెల్లించారు. ధర మొత్తంలో 33 శాతం సోమవారం చెల్లించాల్సి ఉంది. ఒకవేళ టెండరుదారుడు చెల్లించకపోతే మరోసారి ప్రక్రియ జరిపే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details