తెలంగాణ

telangana

ETV Bharat / state

చదువులమ్మ ఒడిలో... 30 ఏళ్ల తర్వాత!

అందరూ కలిసి అక్కడ చదువుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. ఇప్పుడు మళ్లీ అందరూ కలిశారు. ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇవి మహబూబ్​నగర్ జిల్లా కోయిల్​కొండ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిన్న జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో కనిపించిన దృశ్యాలు.

పూర్వవిద్యార్థుల సమ్మేళనం
పూర్వవిద్యార్థుల సమ్మేళనం

By

Published : Jun 6, 2022, 4:22 PM IST

చదువులమ్మ చెట్టు నీడలో ఎదిగిన పూర్వ విద్యార్థులు 30 ఏళ్లకు మళ్లీ కలుసుకున్నారు. మహబూబ్​నగర్ జిల్లా కోయిల్​కొండ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1992-93 బ్యాచ్​ పదో తరగతి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఒకరికొకరు అప్పటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు. అంతా కలిసి తాము విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు రూ.30 వేల నగదును అందజేశారు. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న వారంతా.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోజంతా ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details