Providing Drinking Water Since 50 Years: నారాయణపేట పురపాలకలో ప్రజలకు తాగు నీరు అందించాలని 1970కు ముందు పరిమళపురం(పళ్ల)లో బావిని తవ్వించారు. బావిలో ఊట నీరు వచ్చేవరకు తాగు నీరు అందిస్తూ వచ్చింది. బోరు బావుల సంఖ్య పెరగడంతో అన్ని బావుల్లో ఊటజలం తగ్గింది. ఈ మేరకు దీనిలో సైతం నీరు తగ్గింది. దీంతో పట్టణంలో బోరు బావులు వేసి అక్కడి నుంచి దీనిని నింపేవారు.
బావి నుంచి కుమ్మరివాడలోని ఉపరితల నీటి ట్యాంకుకు తరలించి అక్కడ నుంచి పట్టణం మొత్తం సరఫరా చేశారు. క్రిష్ణ నుంచి వచ్చే సత్యసాయి నీటిని సైతం ఈ బావిలో నింపి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి వినియోగించారు. వేసవి కాలంలో అత్యవసర సమయంలో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకోచ్చి బావిని నింపి మోటార్ల ద్వారా ప్రజల ఇళ్లకు సరఫరా చేశారు. దీనిలో ఊట నీరు రాకపోయిన ప్రజల దాహం తీర్చడం దీని ప్రత్యేకత.