ఓ అసంపూర్తి నిర్మాణంలో ఉన్న పిల్లర్‌కు బోర్డు పెట్టుకుని బోధిస్తున్న యువకుడి పేరు కృష్ణయ్య. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఎమ్మెస్సీ చదివిన ఈయన హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. కరోనా కారణంగా కళాశాలలు తెరవకపోవడం వల్ల గ్రామానికి వచ్చిన ఈయనకు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించాలని యాజమాన్యం ఆదేశించింది.
కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్ బోధన.. సిగ్నల్స్ లేక యాతన - మహబూబ్‌నగర్‌లోని ఆన్‌లైన్ క్లాసుల తీసుకోవడానికి ఉపాధ్యాయుడి కష్టాలు
కరోనా కాలంలో అధ్యాపకులు పడరాని పాట్లు పడుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కాకపోడవం వల్ల వేతనాలు లేక పట్టణాల్లోని ఖర్చులు భరించలేక సొంతూర్లకు తరలివెళ్లారు. కొన్ని కళాశాలలు ఆన్‌లైన్ పాఠాలు చెప్పించుకుంటూ కొంత వరకు డబ్బు ఇస్తున్నారు బాగానే ఉంది. కానీ మారుమూల గ్రామాల్లో ఉండే ఉపాధ్యాయులు ఆ క్లాసులు తీసుకోవడానికి పడే తిప్పలు వర్ణనాతీతం.. అంతర్జాలం రాక.. సరైన వసతులు లేక పిల్లలకు పాఠం చెప్పడానికి బోర్డు నడుముకు కట్టుకుని మరీ పక్కఊరు వెళ్లి పాఠం చెప్తున్న ఈ ఉపాధ్యాయుడిని చూడడండి మీకే తెలుస్తుంది.
మారుమూల గ్రామం కావడం వల్ల అంతర్జాల సిగ్నల్స్ అందక గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని గండీడ్ మండలం మహమ్మదాబాద్ అయ్యప్ప కొండపై ఆలయ ప్రాంగణంలో ఇలా చిన్న స్టాండు ఏర్పాటు చేసుకొని, అందులో సెల్‌ఫోన్, చెవిలో హెడ్ ఫోన్, పిల్లర్‌కు బోర్డు ఏర్పాటు చేసి ఆన్‌లైన్ బోధన చేస్తున్నారు. వారానికి మూడు తరగతులు బోధించాలని చెప్పడం వల్ల ద్విచక్ర వాహనంపై వెనుక బోర్డు పెట్టుకొని, అది కిందపడిపోకుండా నడుముకు కట్టుకొని నానా అవస్థ పడుతూ అయ్యప్ప కొండపైకి వస్తున్నారు. వేతన కోసం ఈ పాట్లు తప్పడం లేదంటున్నారు.
ఇదీచూడండి:కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి