తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడుంబా తయారీ స్థావరాలపై మహిళల దాడులు - బావురుగొండ

తమ గ్రామంలో మద్యం, గుడుంబా తదితర మత్తు పదార్థాలను నిషేధిస్తూ తీర్మానం చేసుకున్నారు. వాటిని తయారు చేసే కేంద్రాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా బావురుగొండలో జరిగింది.

గుడుంబా తయారీ స్థావరాలపై మహిళల దాడులు

By

Published : Oct 24, 2019, 11:40 PM IST

గుడుంబా తయారీ స్థావరాలపై మహిళల దాడులు
మహబూబాబాద్ జిల్లా గంగారం ఏజెన్సీ మండలంలోని బావురుగొండలో మహిళలు గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు. తమ గ్రామంలొ మద్యం, గుడుంబా, గుట్కాలు తదితర పదార్థాలను నిషేధిస్తున్నట్లు స్థానిక మహిళా, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు తీర్మానం చేసుకున్నారు. అనుకున్నదే తడువుగా గ్రామ మహిళలంతా ఊరంతా కలియతిరిగి సోదాలు చేశారు. పంట పొలాలు, వాగుల సమీపంలో నిల్వ చేసిన బెల్లం పానకం, ఇప్పపువ్వు తదితర గుడుంబా తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను వాగులో పడేశారు. సారాకాసే కుండలను మహిళలు ధ్వంసం చేశారు.

ABOUT THE AUTHOR

...view details