తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ నిర్మాణం ఆపాలని ట్యాంకు ఎక్కిన మహిళలు - women protest on water tank

మహబూబాబాద్ గాంధీ పార్కులోని వాటర్ ట్యాంకు ఎక్కి నలుగురు మహిళలు ఆందోళన చేపట్టారు. తమ నివసిస్తున్న ప్రాంతంలో అక్రమ గృహ నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.

అక్రమ నిర్మాణం ఆపాలని ట్యాంకు ఎక్కిన మహిళలు
అక్రమ నిర్మాణం ఆపాలని ట్యాంకు ఎక్కిన మహిళలు

By

Published : Dec 31, 2019, 7:55 PM IST

తమ స్థలంలో అక్రమ నిర్మాణాలు ఆపాలని... నలుగురు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన ఘటన మహబూబాబాద్​లో చోటుచేసుకుంది. పట్టణంలోని వెంకటేశ్వర బజారులో ఉన్న ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని కొంతమంది నివసిస్తున్నారు. ఆ స్థలంలో దారం మమత అనే మహిళ ఇంటిని నిర్మించుకుంటోంది. ఆ నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ రంజిత్ అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. పోలీసులు వెళ్లి దారం మమతను విచారించగా... ఆధారాలు చూపించకపోవడంతో నిర్మాణాన్ని కూల్చివేశారు.

అక్రమ నిర్మాణం ఆపాలని ట్యాంకు ఎక్కిన మహిళలు

ABOUT THE AUTHOR

...view details