తెలంగాణ

telangana

ETV Bharat / state

మా పార్టీలో గెల్చి.. ఆపార్టీలోకి ఎలా వెళ్తారు...?

ఒక పార్టీ గుర్తుపై గెలిచిన శాసనసభ్యులు మరో పార్టీలోకి ఎలా వెళ్తారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హస్తం గుర్తుపై ఎన్నికై తెరాసలో చేరిన ఎమ్మెల్యేలపై భట్టి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇతర పార్టీ గుర్తుపై గెలిచిన వారిని సీఎం కేసీఆర్ ఎలా చేర్చుకున్నారు : భట్టి

By

Published : May 1, 2019, 5:22 AM IST

Updated : May 1, 2019, 7:45 AM IST

ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి ఎలా వెళ్తారు : భట్టి విక్రమార్క

పార్టీ ఫిరాయించిన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్​పై నియోజకవర్గ ప్రజలు 420 చీటింగ్ కేసు పెట్టాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చేరుకుంది. హస్తం గుర్తుపై ఎన్నికై తెరాసలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మీ ఓటు మాకే వెయ్యండి...

ఇతర పార్టీ గుర్తుపై గెలిచిన వారిని సీఎం కేసీఆర్ ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. 32 వేల కోట్లతో గోదావరి నదిపై ప్రాజెక్టులు తమ హయాంలో చేపట్టినవేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వ్యయాన్ని లక్షా 25 వేల కోట్లకు పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతి గుర్తుకే ఓటేసి ఫిరాయింపుదారులకు గట్టి జవాబివ్వాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బలరాం నాయక్, పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ప్రేక్షక పాత్ర వదిలి... ప్రక్షాళన చేయండి...!

Last Updated : May 1, 2019, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details