తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు కూలీ మృతి - రైతు కూలీ మృతి

విద్యుదాఘాతంతో రైతు కూలీ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పశువులను కడుగుతున్న సమయంలో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో రైతు కూలీ మృతి

By

Published : Aug 4, 2019, 11:30 PM IST

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లడ గ్రామానికి చెందిన మేకల కొమరయ్య(38)అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ రైతుకు వ్యవసాయ కూలీగా వెళ్లాడు. వరి వేసేందుకు దుక్కి దున్నడం పూర్తయ్యాక పశువులను కడిగేందుకు మరో రైతుకు చెందిన వ్యవసాయ బోరు బావి వద్దకు వెళ్లాడు. పశువులను కడుగుతున్న సమయంలో విద్యుత్ మోటార్ పైపు పట్టుకున్నాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతం సంభవించి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

విద్యుదాఘాతంతో రైతు కూలీ మృతి

ABOUT THE AUTHOR

...view details