తెలంగాణ

telangana

ETV Bharat / state

3న మెగా వైద్యశిబిరం - doctors

ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 3న మెగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు.

VYDHYA_SHIBIRAM

By

Published : Feb 2, 2019, 3:14 AM IST

Updated : Feb 2, 2019, 8:20 AM IST

VYDHYA_SHIBIRAM
ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 3న మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నామని అపోలో వైద్యుడు ప్రముఖ అంకాలజిస్ట్​ చిన్నబాబు తెలిపారు. దేశంలో అధిక శాతం ప్రజలు క్యాన్సర్​ బారిన పడుతున్నారని అన్నారు. గ్రేస్​ క్యాన్సర్​ పౌండేషన్​ సహకారంతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
సుమారు 250 మంది వైద్యులు, వంద మంది దంత వైద్యులు, రెండు వందల మంది నర్సులు, 300 మంది ఫార్మా వాలంటీర్లు సేవలందిస్తారని చిన్నబాబు తెలిపారు. గిన్నిస్​ రికార్టు కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.
క్యాన్సర్​పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మహబూబాబాద్​ ఎమ్మెల్యే శంకర్​నాయక్​ పేర్కొన్నారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
Last Updated : Feb 2, 2019, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details