తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎడ్లబండిని ఢీ కొట్టిన లారీ - ఎడ్లబండిని ఢీ కొట్టిన లారీ

ఎడ్ల బండిని లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో గుర్తు తెలియని లారీ ఎడ్లబండిని ఢీ కొట్టి వెళ్లిపోయింది.

ఎడ్లబండిని ఢీ కొట్టిన లారీ

By

Published : Nov 22, 2019, 8:22 PM IST

మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని లారీ ఎడ్ల బండిని ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు.

బీరిశెట్టిగూడెం శివారు పంతులు తండాకు చెందిన ధారావత్‌ రాజు గ్రామంలోని రైస్‌ మిల్లు నుంచి బియ్యం తీసుకొచ్చేందుకు ఎడ్లబండిపై వెళ్తున్నాడు. ఎస్సీ కాలనీ వద్దకు వచ్చేసరికి వరంగల్‌ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న గుర్తు తెలియని లారీ ఎడ్లబండిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఘటనలో రాజు తీవ్రంగా గాయపడగా... ఎద్దులకు గాయాలయ్యాయి. బండి విరిగిపోయింది. క్షతగాత్రుడిని తొర్రూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఎడ్లబండిని ఢీ కొట్టిన లారీ

ఇదీ చూడండి: హైదరాబాద్​లో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details