ఉద్యమాలకు పుట్టినిల్లు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యేకత చాటుకున్న మానుకోట ప్రజలు మరోసారి తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు విజ్ఞప్తి చేశారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు.
'ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఉద్యోగులకు పీఆర్సీ' - graduate mlc elections campaign in mahabubabad
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఉద్యోగులకు పీఆర్సీ
పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని రవీందర్ రావు కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. ఉద్యోగ సంఘాల బాధ్యులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
- ఇదీ చూడండి :దీదీపై దాడి ఘటనలో కేసు నమోదు- విపక్షాల విమర్శలు