తెలంగాణ సస్యశ్యామలంగా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపెల్లి శివారు బిల్యానాయక్ తండా, తాళ్లసంకీస శివారు బిల్యా తండాలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఎస్సారెస్పీ స్టేజ్-1,2 కాలువలకు దేవుళ్ల పేర్లు: సత్యవతి రాఠోడ్
ఎస్సారెస్పీ స్టేజ్-1కు వీరభద్రస్వామి, స్టేజ్-2కు భద్రకాళీ మాత కాలువలుగా నామకరణం చేయనున్నట్లు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపెల్లి శివారు బిల్యానాయక్ తండా, తాళ్లసంకీస శివారు బిల్యా తండాలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు.
ఎస్సారెస్పీ స్టేజ్-1,2 కాలువలకు దేవుళ్ల పేర్లు: సత్యవతి రాఠోడ్
ఎస్సారెస్పీ కాలువల ద్వారా అన్ని చెరువులు నింపుతామన్నారు. కాలువల మరమ్మతులు, సమస్యలపై త్వరలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. కాలువలకు ఓటీలు ఏర్పాటు చేసి రెండు పంటలకు సరిపడ సాగునీరు అందిస్తామన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్-1కు వీరభద్రస్వామి, స్టేజ్-2కు భద్రకాళీ మాత కాలువలుగా నామకరణం చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:భారత్, చైనా సరిహద్దు వివాదం- 10 కీలకాంశాలు