హైదరాబాద్‌లోని శిశువిహార్‌లో ఉంటున్న అవిభక్త కవలలు వీణావాణీలను రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాఠోడ్ కలిశారు. మహబూబాబాద్‌జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మారగాని మురళి-నాగలక్ష్మి దంపతుల పిల్లలే వీణా-వాణి. పుట్టుకతోనే తలలు అతుక్కుని జన్మించారు. వారిని వేరు చేసేందుకు అన్ని విధాల ప్రయత్నాలు జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. పదిహేడేళ్ల వీణా-వాణిలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు.
'మీ తల్లిదండ్రులతో కలిసి వస్తా..వీణావాణిలకు మంత్రి మాట'
హైదరాబాద్ శిశువిహార్‌లో ఉంటున్న అవిభక్త కవలలు వీణా-వాణీలను రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ కలిశారు. వారికి స్వీట్స్ తినిపించి బాగా చదువుకోవాలని సూచించారు.
తాము పెరిగి పెద్దవారవుతుండటం వల్ల తమ వెంటే ఉండాలని తల్లిదండ్రులను కోరారు. ఈనెల 30న మహబూబాద్‌కు వచ్చిన మంత్రి సత్యవతి రాఠోడ్‌ను కవలల తల్లిదండ్రులు మురళి-నాగలక్ష్మి కలిసి తమ పిల్లల వెంట తాము ఉండేలా చూడాలని కోరారు. స్పందించిన మంత్రి తానే శిశువిహార్‌కు వెళ్లి పిల్లలను కలిసి మాట్లాడుతానని చెప్పారు. ఈరోజు తన జన్మదినం సందర్భంగా శిశువిహార్‌కు వెళ్లి వీణావాణీలను కలిసి వారితో ఆప్యాయంగా మాట్లాడారు సత్యవతి రాఠోడ్. వారికి స్వీట్స్ తినిపించి, బాగా చదువుకోవాలని కోరారు. వారి తల్లిదండ్రులతో కలిసి మరోసారి వీణా-వాణిల వద్దకు వస్తానని మాటిచ్చారు.