మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా ఓ ఇంటిని కూల్చివేసేందుకు అధికారులు వెళ్లగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇంటి యజమానురాలు ఆత్మహత్యాయత్నం చేయబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నా.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇల్లును కూల్చడమేంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కంబాలపల్లిలో ఉద్రిక్తం... మహిళ ఆత్మహత్యాయత్నం
జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా ఓ ఇంటిని కూల్చివేసేందుకు అధికారులు వెళ్లగా.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఓ మహిళ ఆత్మహత్యాయత్నంకి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
కంబాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు.. మహిళ ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్ జిల్లా జమాండ్ల పల్లి నుంచి వరంగల్ గ్రామీణ జిల్లా బుధరావుపేట వరకు జరుగుతున్న నేషనల్ హైవే 365 పనుల్లో భాగంగా కంబాలపల్లి గ్రామంలో రహదారికి అడ్డువస్తున ఇండ్లకు 2 సంవత్సరాల క్రితం అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా తొలగించకపోగా.. తహసీల్దార్ రంజిత్, సీఐ రవికుమార్‌లతో కలిసి ఆర్ అండ్ బీ అధికారుల సమక్షంలో కూల్చివేసేందుకు వెళ్లగా.. ఆ ఇంటి కుటుంబ సభ్యులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చివరకు తహసీల్దార్ రెండు రోజుల సమయం ఇవ్వగా వివాదం సద్దుమణిగింది.