కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రైతు బస్సు జాతా శనివారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చేరింది. వీరికి స్థానికి సీపీఎం కార్యకర్తలు, గీత కార్మిక సంఘం నాయకులు మద్దతు తెలిపారు.
'సాగు చట్టాలు రద్దు చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తాం' - telangana farmers union protest
కొత్త సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం రైతు బస్సు జాతా కార్యక్రమం చేపట్టింది. శనివారం ఈ యాత్ర మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చేరుకుంది.
మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్న రైతు బస్సు జాతా
నూతన సాగు చట్టాలతో రైతులకు కలిగే నష్టాలపై పాటలు పాడి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యవసాయ, విద్యుత్ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని లేనియెడల ఆందోళనలు ఉద్ధృతం చేస్తామనని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి శోభన్ నాయక్ హెచ్చరించారు.
- ఇదీ చూడండి :ఫిబ్రవరి 15నుంచి ప్రత్యక్ష తరగతులు..?