తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ కాలువతో అన్నదాతల ఆశ ఆవిరైపోయింది - ఆ కాలువతో అన్నదాతల ఆశ ఆవిరైపోయింది

పంటలు బాగా పండేందుకని... అధికారులు ఉపకాలువని తవ్వించారు. కానీ ఆ ఉపకాలువే ఆ అన్నదాతల పంటలను నాశనం చేసింది. సుమారు పదెకరాల పత్తి, మిరప పంటలను నీట ముంచింది.

ఆ కాలువతో అన్నదాతల ఆశ ఆవిరైపోయింది

By

Published : Oct 22, 2019, 9:01 AM IST

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ శివారు దేశ్యాతండా వద్ద ఎస్సారెస్పీ ఉప కాలువకు గండిపడింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలన్నీ నాశనమయ్యాయి. గతంలో దేశ్యాతండా శివారులోని డీబీఎం-60 ప్రధాన కాలువ నుంచి రైతుల సాగు భూములకు జలాలు తరలించేందుకు ఉపకాలువను తవ్వారు. కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఉప కాలువకు ఇరువైపులా ఉన్న కట్టభూమి ఆక్రమణకు గురై...నీరు ప్రవహించి కుంగిన ప్రదేశంలో గండిపడింది. గోదావరి జలాలు మొత్తం రైతుల పంట చేల మీదుగా ప్రవహించాయి. సుమారు పదెకరాల్లో సాగు చేసిన పత్తి, మిరప పంటలు పాడైపోయినట్లు రైతులు తెలిపారు.

ఆ కాలువతో అన్నదాతల ఆశ ఆవిరైపోయింది

ABOUT THE AUTHOR

...view details