తెలంగాణ

telangana

ETV Bharat / state

వట్టివాగు సమ్మక్క. సారలమ్మ జాతర ఎక్కడో తెలుసా..?

ప్రతి రెండేళ్లకొసారి నిర్వహించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మాదిరిగానే మహబూబాబాద్ జిల్లాలో వట్టివాగు సమ్మక్క. సారలమ్మ జాతర నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మండ మెలిగే కార్యక్రమాన్ని గిరిజన పూజారులు మేళతాళాలతో పసుపు, కుంకుమలతో వైభవంగా జరిపారు.

sammakka saralamma jatara at mahabubabad
వట్టివాగు సమ్మక్క. సారలమ్మ జాతర ఎక్కడో తెలుసా..?

By

Published : Jan 29, 2020, 11:50 PM IST

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లి శివారులో వట్టివాగు సమ్మక్క. సారలమ్మ జాతరలో మండ మెలిగే కార్యక్రమాన్ని గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించారు. మేళతాళాలతో పసుపు, కుంకుమలతో గద్దెలను శుద్ధిచేసి, అడవి పూలతో అలంకరించి జాతరలో ఎలాంటి దుష్టశక్తులు ఆవహించకుండా అమ్మవార్లను వేడుకున్నారు. జాతర సాఫీగా సాగిపోవాలని గద్దెల చుట్టూ పొలి పోసి కోయ దొరల వేషధారణలో ఆదివాసీలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

జాతర పూర్తయ్యే వరకు పూజారులు ప్రతిరోజు గద్దెలను శుద్ధిచేసి దీపాలు వెలిగించి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి ఉపవాసం ఉంటారు. మేడారంలో ఏ విధంగా నాలుగు రోజుల పాటు వైభవంగా జాతర జరుగుతుందో, ఇక్కడ కూడా అదేవిధంగా నాలుగు రోజులపాటు వైభవోపేతంగా జాతర నిర్వహిస్తారు. మేడారం వెళ్లలేని వారు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటారు.

వట్టివాగు సమ్మక్క. సారలమ్మ జాతర ఎక్కడో తెలుసా..?

ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details