మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. డిపో నుంచి ఉదయం 6 గంటలకే బస్సులు వివిధ రూట్లకు బయల్దేరాయి. లాక్డౌన్ నిబంధనల మేరకు అధికారులు బస్సులను డిపోలోనే శానిటైజ్ చేసి పంపిస్తున్నారు. విధుల్లో చేరే సిబ్బంది సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, చేతులను శుభ్రం చేసుకున్న తర్వాత డ్యూటీలో చేరే విధంగా డిపోలో అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 7 గంటల లోపు బస్సులు తిరిగి డిపోకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు డీఎం మహేశ్ తెలిపారు. హైదరాబాద్ వెళ్లే బస్సులు ఉప్పల్ రింగ్ రోడ్ వరకే నడుస్తాయని అన్నారు. ప్రయాణికులంతా మాస్కులు ధరించి , సామాజిక దారం పాటిస్తూ బస్సులోకి ఎక్కాలని విజ్ఞప్తి చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన ప్రజా రవాణా
లాక్డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు... రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో ఉదయం 6 గంటల నుంచే వివిధ రూట్లకు బస్సులు బయల్దేరాయి.
mahabubabad district latest news
ప్రతి ట్రిప్‌కు సిబ్బందితోపాటు బస్సును శానిటైజ్ చేయిస్తున్నామన్నారు. ఈరోజు 50 శాతం బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుండి ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులను నడుపుతామని చెప్పారు.
TAGGED:
ఆర్టీసీ బస్సులు ప్రారంభం