మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం శివారు దుబ్బతండాలో పోలీసులు, అబ్కారిశాఖ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 250 లీటర్ల బెల్లం ఊట, 15 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేశారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 60 కిలోల నల్లబెల్లం, 15 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు.
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు- బెల్లం ఊట, పటిక స్వాధీనం - ఆబ్కారి సీఐ లావణ్యసంధ్య
పోలీసులు, ఆబ్కారిశాఖ అధికారులు కలిసి గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఈ తనిఖీల్లో భారీగా బెల్లం ఊట, గుడుంబాను ధ్వంసం చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు.
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు- బెల్లం ఊట, పటిక స్వాధీనం
గుడంబా తయారీకి పాల్పడుతున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆబ్కారి సీఐ లావణ్యసంధ్య, ఎస్సై అశోక్ తెలిపారు. అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవీ చదవండి: 'గంగుల శ్రీనివాస్ మృతికి ప్రభుత్వ వైఖరే కారణం'