తెలంగాణ

telangana

ETV Bharat / state

పేరు తెచ్చిన తిప్పలు.. చనిపోయానంటూ పింఛను ఆపేశారు

కొందరు ముద్దుగా మరికొందరు జ్ఞాపకార్థంగా తాతల పేరు మనవడికి పెడుతుంటారు. కానీ పాపం ఈ దివ్యాంగుడికి మాత్రం ఆ పేరు కష్టాలను తెచ్చి పెట్టింది. తాతది, తనది ఒకే పేరుగా ఉండడం.. తాత చనిపోవడం వల్ల తానే చనిపోయినట్టు నిర్ధరించిన అధికారులు పింఛను ఇవ్వడం నిలిపివేశారని. దానితో తిండికి జరగడంలేదని ఆ దివ్యాంగుడు కన్నీరుమున్నీరయ్యాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది.

pension stopped for disable person in mahabubabad
పేరు తెచ్చిన తిప్పలు.. చనిపోయానంటూ పింఛను ఆపేశారు

By

Published : Jul 22, 2020, 4:17 PM IST

మహబూబాబాద్​ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన దివ్యాంగుడు షేక్​ ఖాసీంకు 2010 సంవత్సరం నుంచి ఫించన్​ వస్తోంది. కాగా ఇతడి తాత పేరు కూడా షేక్​ ఖాసీం. అతను చనిపోయాడు. అయితే సిబ్బంది గ్రామంలో సర్వేకి వచ్చిన సందర్భంలో తాను మరణించినట్లు పేర్కొంటూ ఆరు నెలలుగా పింఛను నిలుపుల చేశారంటూ దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ఎంపీడీవో రవీందర్​రావును వివరణ కోరగా.. దివ్యాంగుడి పింఛన్​ విషయమై పూర్తి నివేదికను డీఆర్​డీవోకు పంపించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details