తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగి ఉన్న ట్రాక్టర్​ను ఢీకొని యువకుడి దుర్మరణం

ఆగి ఉన్న పత్తి ట్రాక్టర్​ను ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది.

ఆగి ఉన్న ట్రాక్టర్​ను ఢీకొని యువకుడి దుర్మరణం
ఆగి ఉన్న ట్రాక్టర్​ను ఢీకొని యువకుడి దుర్మరణం

By

Published : Jan 6, 2020, 12:07 PM IST

ఆగి ఉన్న ట్రాక్టర్​ను ఢీకొని యువకుడి దుర్మరణం
మహబూబాబాద్​ జిల్లా నర్సింహులపేట మండలం పడమటి గూడెం స్టేజి సమీపంలోని పత్తి మిల్లులో పత్తిని విక్రయించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వాహనాలను వరంగల్, ఖమ్మం రహదారి వెంట నిలిపారు. మహబాబూబాద్​ జిల్లా దంతాలపల్లి మండలం శివారులోని రహదారిపై సుమారు కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరి ఉన్నాయి.

ఈ క్రమంలో తెల్లవారుజామున ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లికి చెందిన బుద్ద హరీశ్​ (32) అనే వ్యక్తి తొర్రూరు నుంచి ఖమ్మం వైపు ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రతి ట్రాక్టర్ కనిపించకపోవడం వల్ల వెనకనుంచి బైక్​తో బలంగా ఢీకొట్టగా.. హరీశ్​ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించి.. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details