మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చంద్రుగూడెంలో వడదెబ్బతో రాములు అనే 70 సంవత్సరాల వృద్ధుడు మృతిచెందాడు. రాములు పశువులను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం బయట నుంచి ఇంటికి రాగానే అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతిచెందాడు.
మహబూబాబాద్‌లో వడదెబ్బతో వృద్ధుడు మృతి - oldman
ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. మహబూబాబాద్‌లో ఓ పశువుల కాపరి వడదెబ్బ తగిలి మరణించాడు.
వడదెబ్బతో వృద్ధుడు మృతి