ఈదురు గాలుల బీభత్సం... దుప్పి మృతి
గూడూరు మండలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి తట్టుకోలేక దుప్పి మృతి చెందింది.
mahabubabad district latest news
మహబూబాద్ జిల్లా గూడూరు మండలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి అడవిలో నుంచి రెండు దుప్పిలు చకృ తండా వైపు పరుగులు తీశాయి. వీటిలో ఓ దుప్పి గ్రామ శివారులోని నర్సరీ ముందు పడిపోయింది. దీనిని చూసిన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బీట్ అధికారి రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకొని పడిపోయిన దుప్పిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా మృతి చెందింది.