తెలంగాణ

telangana

ETV Bharat / state

'లాక్​డౌన్​ పూర్తయ్యేవరకు నిబంధనలు పాటించండి' - lock down update

మహబూబాబాద్​లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే శంకర్​నాయక్. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.​

mla shanker nayak distributed kalyana laxmi cheuues in mahaboobabad
'లాక్​డౌన్​ పూర్తయ్యేవరకు నిబంధనలు పాటించండి'

By

Published : May 7, 2020, 5:00 PM IST

లాక్​డౌన్ పూర్తయ్యే వరకు ప్రజలంతా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే శంకర్​నాయక్​ తెలిపారు. మహబూబాబాద్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 74 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 1922 వివాహాలు జరగ్గా 1546 చెక్కులను పంపిణీ చేసినట్లు, మిగతావి కూడా త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

అందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని వేడుకుంటున్నానని ఎమ్మెల్యే తెలిపారు. లాక్​డౌన్ సమయంలో పోలీసులు, వైద్యులు, మున్సిపల్ కార్మికులు, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారని, వారి సేవలు మరువలేనివని ఎమ్మెల్యే కొనియాడారు.

ఇవీ చూడండి:విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి

ABOUT THE AUTHOR

...view details