రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దంతాలపల్లి, గున్నేపల్లి, కుమ్మరి కుంట్ల, రేపోని, వేములపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. వేములపల్లి స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్ట్‌ను సందర్శించారు. పోలీస్ సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు మాస్కులు పంపిణీ చేశారు.అనాథ వృద్ధుడికి బియ్యం అందజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే - corona virus latest news
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పరిశీలించారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎస్సారెస్పీ కాలువల ద్వారా గోదావరి జలాల రాకతో డోర్నకల్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న సాగయిందన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. రానున్న వానాకాలం సాగుకు అవసరమైన ఎరువులను ముందుగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలన్నారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సీఎం కేసీఆర్‌కు పీసీసీ కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ బహిరంగ లేఖ