మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండధర్మారం శివారు సీతారం తండాలో ఇటీవల హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని నియోజకవర్గ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని సీతక్క డిమాండ్ చేశారు.
Mla seethakka: హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క - mla seethakka latest news
మహబూబాబాద్ జిల్లా సీతారం తండాల్లో ఇటీవల హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ముందుగా ఎమ్మెల్యే సీతక్క హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ వాస్తవాలను బయటకు తీయాలన్నారు. ఆడకూతురుకు న్యాయం జరగాలన్నారు. మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా చాడాలని పోలీసులను కోరారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందించి.. ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. కార్యక్రమంలో ఆమెతో పాటు నియోజకవర్గ ఇంఛార్జీ రామచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ