ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మహబూబాబాద్‌లో కారు గుర్తు గల పతంగులను... మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోతు కవిత ఎగురవేశారు.
సంక్రాంతి పండగ సందర్భంగా చిన్న పిల్లలు పతంగులు ఎగురవేస్తే.... మహబూబాబాద్ పురపాలికపై తెరాస జెండా ఎగుర వేస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. 36 వార్డుల్లో ఒక వార్డు ఏకగ్రీవమవ్వగా... మిగతా 35 వార్డులను గెలుచుకుంటామని స్పష్టం చేశారు.