మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాఠోడ్ జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్‌తో కలిసి పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 27వ వార్డులో పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు.
'పటిష్ఠ ప్రణాళికతో మహబూబాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తాం' - పట్టణ ప్రగతిలో మంత్రి సత్యవతి రాఠోడ్
పట్టణ ప్రగతి మొదటి దశ చివరి రోజులో భాగంగా మంత్రి సత్యవతిరాఠోడ్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పటిష్ఠ ప్రణాళికతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
'పటిష్ఠ ప్రణాళికతో మహబూబాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తాం'
పది రోజులుగా పట్టణంలోని అన్ని వార్డుల్లో తిరిగి సమస్యలను గుర్తించి, పరిష్కరించే ప్రయత్నం చేశామని మంత్రి పేర్కొన్నారు. పటిష్ఠ ప్రణాళిక రూపొందించి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
ఇవీ చూడండి:రైతుల ఆవేదన.. వినియోగదారుడికి ఆనందం