పల్లెలన్నీ పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలనే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని రూపొందించారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కరోనా వ్యాప్తి నియంత్రణకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని.. పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని కోరారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రంలోకి తరలించి అన్ని వసతులు సమకూర్చుతామన్నారు. రాంపురం వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ పథకంలో కొన్ని గ్రామాల్లో నల్లా కనెక్షన్లు ఇవ్వాలేదని.. ఆయా సమస్యలు పరిష్కరించాలన్నారు. విధిగా ట్యాంకులను శుభ్రం చేసుకునేలా చూడాలని కలెక్టర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, కలెక్టర్ వీపీ గౌతమ్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు పాల్గొన్నారు.
ఇవీచూడండి:'మానవ తప్పిదంతోనే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం!'