ఖరీఫ్ కంటే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలను పెంచడమే గాక, ఈ సారి కూడా ప్రభుత్వమే రైతుల వద్దకి వచ్చి పంట కొనుగోలు చేస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తొందరపడి దళారులకు అమ్ముకొని మోసపోవద్దని రైతులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భూముల సర్వే, నియంత్రిత సాగు, జిల్లా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులు నియంత్రిత సాగులో వ్యవసాయం చేస్తున్నారని సత్యవతి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుకు గన్నీ బ్యాగ్స్, గోడౌన్స్, మార్కెటింగ్ తదితర సౌకర్యాలు ముందే సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్వహించే ధరణి సర్వేకి ప్రజల నుంచి పూర్తి సహకారాలు అందుతున్నాయని తెలిపారు.