తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి సత్యవతి రాఠోడ్ నిత్యావసరాలు పంచారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మదర్సాలో యంగిస్థాన్ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో వలస కూలీలు, హిజ్రాలకు 12 రకాల నిత్యావసరాల కిట్లు పంచారు. వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు మంత్రి ఆధ్వర్యంలో మహ్మద్ అఫ్సర్ కలెక్టర్ గౌతమ్‌కు రూ.10వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసరాలు పంచిన మంత్రి సత్యవతి - మహబూబాబాద్ జిల్లా వార్తలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. మంత్రి ఆధ్వర్యంలో వలస కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు జిల్లా కలెక్టర్ గౌతమ్ చేతుల మీదుగా రూ.10వేల చెక్‌ను అందించారు.
నిత్యావసరాలు పంచిన మంత్రి సత్యవతి