తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో కేసీఆర్: ఎర్రబెల్లి - errabelli dayakara rao

స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని సూచించారు.

ప్రజల గుండెల్లో కేసీఆర్

By

Published : May 1, 2019, 11:20 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో తొర్రూరు, పెద్దవంగర మండలాల పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు. పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

ప్రజల గుండెల్లో కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details