పురపాలిక ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని, అత్యధిక మెజారిటీతో గెలిచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో పురపాలిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిశారు.
'క్లీన్ స్వీప్ చేద్దాం... కేసీఆర్, కేటీఆర్కు బహుమతిగా ఇద్దాం' - మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
డోర్నకల్, మరిపెడలను మున్సిపాలిటీలుగా చేసిన ఘనత కేటీఆర్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో పర్యటించారు.
'పుర విజయాన్ని వారికి బహుమతివ్వాలి'
డోర్నకల్, మరిపెడ ప్రాంతాల అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలుస్తాయో చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు సమష్టి కృషితో పనిచేసి ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చారు.