తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ లోక్ అదాలత్​లో 142 కేసులు పరిష్కారం

మహబూబాబాద్​లో జిల్లా కోర్టుల సముదాయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్​లో 142 కేసులు పరిష్కరించబడ్డాయి. పలు కేసుల్లో రికవరీ మొత్తాలు, రాజీ మార్గాల ద్వారా నగదును వసూలు చేసి పరిష్కారం చేశారు.

Many cases are settled in the National Lok Adalat at mahabubabad
జాతీయ లోక్ అదాలత్​లో 142 కేసులు పరిష్కారం

By

Published : Dec 13, 2020, 4:10 AM IST

మహబూబాబాద్​లో జిల్లా కోర్టుల సముదాయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్​లో 142 కేసులు పరిష్కరించబడ్డాయి. మొదటి బెంచ్​లో లోక్ అదాలత్ సభ్యుల ఆధ్వర్యంలో 10 మోటారు వాహన ప్రమాదాల కేసుల్లో 66,72,552 రూపాయలను బాధితులకు ఇప్పించారు. రెండో బెంచ్​లో రెండు కేసుల్లో విద్యత్ శాఖ నుంచి నాలుగు లక్షల నష్ట పరిహారం భాదితులకు అప్పంచారు.

రికవరీ మనీ కేసుల్లో 3,25,000, తొమ్మిది ప్రి లిటిగేషన్ కేసుల్లో ఇండియన్ బ్యాంకు వారికి 8,83,000 రీకవరి చేయించి మొత్తం పన్నెండు కేసులు పరిష్కరించారు. మూడో బెంచ్​లో 107 క్రిమినల్ కేసుల వివాదాలను రాజీ రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. ఓ ఒక సివిల్ వివాదం, ఎక్సైజ్ కేసుల్లో 55,000 రూపాయలు ఫైన్ విధించారు.

ఆరో అదనపు జిల్లా జడ్జ్​ అనిల్ కుమార్, లోకాదలత్ సభ్యులు దాసరి నాగేశ్వరరావు, కొంపల్లి వెంకటయ్య, తుంపిల్ల శ్రీనివాస్, ఎస్.కే.పాషా, మామిడాల సత్యనారాయణ, కే.మౌనికల ఆధ్వర్యంలో అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇదీ చూడండి :గ్రనేడ్ల కలకలం: ఏ చెట్టు కింద ఏ బాంబు ఉందో!

ABOUT THE AUTHOR

...view details