మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో జరిగిన ఫ్రైడే-డ్రై డే కార్యక్రమానికి మహబూబాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ బిందు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మురుగు నీటి కాలువల్లో ఆయిల్ బాల్స్ వేశారు. చెత్తచెదారాన్ని తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పినిరెడ్డిగూడెంలోని పల్లె ప్రకృతి వనం నందు మొక్కలను నాటారు.
'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ ఛైర్పర్సన్
ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని మహబూబాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ బిందు అన్నారు. గార్ల మండల కేంద్రంలో 'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేశారు.
గత సంవత్సరం గార్ల మండలంలో మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారని జడ్పీ ఛైర్పర్సన్ బిందు అన్నారు. ఈ ఏడాది అలా జరగకుండా ముందస్తుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, ఫ్రైడే-డ్రై డే లాంటి కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లోని ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఝాన్సీ లక్ష్మి, ఎంపీపీ శివాజీ చౌహన్, ప్యాక్స్ ఛైర్మన్ దుర్గాప్రసాద్, గార్ల సర్పంచ్ బన్సీలాల్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: వీహెచ్