తెలంగాణ

telangana

ETV Bharat / state

కడచూపు కోసం కన్నపేగు తల్లడిల్లుతోంది..! - విదేశాంగశాఖ

పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు.. మరణించాడనే వార్త విని ఆ తల్లి హృదయం ఆరు రోజులనుంచి తల్లడిల్లిపోతోంది. మృతదేహాన్ని కడసారి చూసే అవకాశమైనా వస్తుందో లేదోనని కన్నీటి పర్యంతమవుతోంది.

mahabubabad person deid in usa with heart attack
కడసారి చూపుకోసం కన్నపేగు తల్లడిల్లుతోంది

By

Published : Dec 29, 2020, 1:38 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన చంద్రపాల్ ​రెడ్డి(26) అనే యువకుడు ఈ నెల 23న అమెరికాలోని టెక్సాస్​లో గుండెపోటుతో మృతిచెందాడు. తమ కుమారుడిని చివరిచూపు చూసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ.. మృతుడి తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన చంద్రపాల్‌రెడ్డి(26) ఉన్నత విద్య కోసం 2015లో అమెరికాలోని టెక్సాస్‌కు వెళ్లాడు. చదువు పూర్తిచేసి.. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 23న ప్రమదావశాత్తు గుండెపోటుతో మృతిచెందాడు.

అమెరికాలో క్రిస్మస్ సెలవుల కారణంగా మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం కాలేదని బాధితుడి తల్లిదండ్రులు విలపించారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశాంగశాఖ సహకారంతో.. కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని సీఎం కేసీఆర్​ను వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:కళ్లెదుటే కొనఊపిరితో కుమారుడు.. ఫలించని తల్లి ప్రయత్నం

ABOUT THE AUTHOR

...view details