సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. అనవసరంగా ఎవరూ బయటకు రావద్దన్నారు. మరిపెడ మండలం తానంచర్ల, రాంపురం, దంతాలపల్లి మండలం వేములపల్లి శివారులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను తనిఖీ చేశారు.
'సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను అందరూ పాటించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
వేములపల్లి చెక్‌పోస్టు వద్ద కలెక్టర్ తనిఖీ
సూర్యాపేటలో కరోనా వైరస్ ప్రబలినందున ఆ జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లాకు రాకపోకలు నిలిపివేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.