మహబూబాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, గోదాముల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి గుమ్ముడూరు, అనంతారం గ్రామాల్లో పర్యటించారు. జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు గానూ... గోదాములు నిర్మాణం కోసం గుమ్ముడూరులో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, గోదాములకు స్థలాల పరిశీలన - LOCK DOWN UPDATES
ప్రభుత్వ కార్యాలయాలు, గోదాములను నిర్మించేందుకు మహబూబాబాద్ శివారులోని అనంతారం, గుమ్ముడూరు గ్రామాల్లోని స్థలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్... మ్యాప్‌లతో కూడిన నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
గుమ్ముడూరులోని సర్వే నెంబర్ 287లో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ బాలుర కళాశాలకు 5 ఎకరాలు, మైనారిటీ సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలకు 5 ఎకరాలు, జిల్లా సైన్స్ సెంటర్‌కు ఎకరం, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఈజీఎంఎం శిక్షణా కేంద్రానికి 2 ఎకరాలను అధికారులు కలెక్టర్‌కి చూపించారు. కోర్ట్ భవనానికి కేటాయింటిన భూమిని కలెక్టర్ పరిశీలించారు.
అనంతారంలోని ప్రభుత్వ భూములులో గుట్టలు ఉండటం వలన గోదాముల నిర్మాణానికి వీలుకాదని... గుమ్ముడూరులోని 287 సర్వే నెంబర్లో 20 ఎకరాలకు స్థలం కేటాయించాలని, ఆ స్థలానికి సరిహద్దులు గుర్తించి మ్యాప్‌తో సహా నివేదిక అందజేయాలని ఆర్డీఓ కొమురయ్యను కలెక్టర్ ఆదేశించారు.