మహబూబాబాద్ జిల్లా పర్వతగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో శౌచాలయాలు లేనందున విశ్రాంత సమయంలో టాయిలెట్‌కు వెళ్లాలంటే విద్యార్థులు రోడ్డు దాటి ఆరుబయటకు వెళ్లేవారు.
కేవలం రూ.350లతో టాయిలెట్ల నిర్మాణం.. ఎలా సాధ్యం? - తక్కువ ఖర్చుతో టాయిలెట్లు
ఆ పాఠశాలలో విద్యార్థులు టాయిలెట్‌కు వెళ్లాలంటే రోడ్డు దాటి బయటకు వెళ్లాల్సి వచ్చేంది. విద్యార్థులు పలుమార్లు ప్రమాదాలకు గురవ్వడం వల్ల... ప్రమాదాలు నివారించడానికి.. అతి తక్కువ ఖర్చుతో మూత్రశాలలను నిర్మించింది పర్వతగిరి ప్రభుత్వ పాఠశాల.
మహబూబాబాద్‌లో తక్కువ ఖర్చుతో టాయిలెట్లు
రోడ్డు దాటే అప్పుడు పలుమార్లు విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యారు. ఈ ప్రమాదాలు నివారించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన టాయిలెట్లు నిర్మించే యోచన చేశారు పాఠశాల ఉపాధ్యాయులు.
వాడి పడేసిన వంటనూనె క్యాన్లతో టాయిలెట్స్ నిర్మించారు. సాధారణంగా బేషన్లతో నిర్మిస్తే రూ.5500 ఖర్చు అయ్యేది.. ఈ వంటనూనె క్యాన్లతో కేవలం రూ.350లతోనే టాయిలెట్స్ నిర్మించారు. వీరి ఈ చిన్న ప్రయత్నం అందరికీ ఆశ్చర్యం కలిగించడమే కాదు ఆదర్శంగానూ నిలుస్తోంది.