విద్యుదాఘాతంతో లారీ దగ్ధమైన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. డోర్నకల్ మండలం మన్నెగూడెం నుంచి చిలుక్కోయలపాడుకు ప్రొక్లెయిన్ తరలిస్తుండగా... విద్యుత్తు తీగలకు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న ప్రొక్లెయిన్ వెంటనే కిందకు దింపడం వల్ల నష్టం తప్పింది. రూ. 25 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
విద్యుదాఘాతంతో లారీ దగ్ధం... రూ. 25 లక్షల ఆస్తి నష్టం - mahabubabad
మహబూబాబాద్ జిల్లాలో విద్యుదాఘాతంతో లారీ దగ్ధమైంది. ప్రయాణికులు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.
విద్యుదాఘాతంతో లారీ దగ్ధం... రూ. 25 లక్షల ఆస్తి నష్టం