తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రం తమ విధానాలు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తాం' - government companies privatization

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఐఎఫ్టీయూ, సీఐటీయూ, జాతీయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నాయకులు తీవ్రంగా ఖండించారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

left parties protest against central government in torrur
left parties protest against central government in torrur

By

Published : Jul 3, 2020, 4:42 PM IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఐఎఫ్టీయూ, సీఐటీయూ, జాతీయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు.

ఈ ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దోమ బిక్షపతి, సీపీఎం జిల్లా నాయకులు వెంకటయ్య, ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు కొత్తపల్లి రవి పాల్గొన్నారు. విదేశీ కార్పొరేట్ కంపెనీలకు దేశ సర్వసంపదలు, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పజెప్పడానికి వ్యతిరేకంగా కార్మికవర్గం ఒకటి అయిందని నాయకులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఇవీ చూడండి:రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు

ABOUT THE AUTHOR

...view details