తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంజెక్షన్ చేశారు...  మా నాన్నను చంపేశారు...

చావు బతుకుల మధ్య ఉన్నవారికి వైద్యం అందించే విషయంలో ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. చికిత్స కోసం వచ్చిన రోగికి సరైన వైద్యం అందించకపోగా... చనిపోయిన రోగిని గుట్టుచప్పుడు కాకుండా తరలించిన అమానవీయ ఘటన ఖమ్మంలో జరిగింది.

ఇంజెక్షన్ చేశారు..  మా నాన్నను చంపేశారు..

By

Published : Mar 8, 2019, 8:04 PM IST

ఇంజెక్షన్ చేశారు.. మా నాన్నను చంపేశారు..
మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగుకు చెందిన కృష్ణ ఆటో డ్రైవర్. కొంతకాలంగా నడుమునొప్పితో బాధపడుతున్నాడు. ఎప్పటిలాగే ఖమ్మంలోని పాటిబండ సుదర్శన్ రావు ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్న కృష్ణ తన కొడుకుతో కలిసి ఆస్పత్రికి వచ్చాడు. అక్కడ ఆస్పత్రి సిబ్బంది యాంటీ బయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చారు. కాసేపటికే నోట్లో నుంచి నురగలు కక్కుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది బాధితున్ని హుటాహుటిన ఆటోలో గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని కృష్ణ బంధువులు తెలిపారు.

చనిపోగానే డ్రామా మొదలెట్టారు

అంతా సినిమా తరహాలో జరిగిన తంతు 10 ఏళ్ల బాలుడికి మాత్రం ఏం అర్థం కాలేదు. తన తండ్రి ఇంకా బతికే ఉన్నాడని.. మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పినట్లు కన్నీటి పర్యంతమయ్యాడు.
అచేతనంగా వున్న కృష్ణను ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి.. ఇంజెక్షన్ వికటించడం వల్లనే మృతిచెందినట్లు తెలిపారు.

చేతులు దులుపుకొనే యత్నం

అయితే ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు మాత్రం కృష్ణ మృతికి మరో కారణం చెబుతున్నారు. అతడు కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడని.. దానివల్లే చనిపోయాడని వెల్లడించారు.

వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగికి సరైన చికిత్స అందించకపోగా.. చనిపోగానే... గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వాసుపత్రికి తరలించడం ఏంటని రోగి బంధువులు ప్రశ్నిస్తున్నారు. తండ్రి మరణం తట్టుకోలేక పదేళ్ల బాలుడు కన్నీటి పర్యంతమైన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

ఇవీ చూడండి :ఉమెన్స్ సేఫ్టీ​ వింగ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details