తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి: శంకర్​నాయక్​ - ప్రత్యేక పారిశుద్ధ్యం కార్యక్రమంలో పాల్గొన్న శంకర్​నాయక్​ వార్తలు

సీజనల్​ వ్యాధుల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే శంకర్​నాయక్ పేర్కొన్నారు. ఆదివారం 10 గంటలకు.. 10 నిమిషాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Keep the surroundings clean: Shankar Nayak
ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి: శంకర్​నాయక్​

By

Published : Jul 5, 2020, 1:42 PM IST

సీజనల్​ వ్యాధుల నివారణకు మంత్రి కేటీఆర్​ ఇచ్చిన ప్ర‌తి ఆదివారం 10 గంట‌ల‌కు.. 10 నిమిషాల కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే శంకర్​నాయక్​ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో చెట్ల కుండీల్లో చెత్తను తొలగించారు. నిలువ నీటిని పారబోశారు. అనంతరం గార్డెన్​లో చెత్తా, చెదారం తీసేసి పరిసరాలను శుభ్రం చేశారు.

మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్య‌క్ర‌మాన్ని ఒక ఉద్య‌మంగా నిర్వహించాలని కోరారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఇదీచూడండి: దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మంత్రి శ్రీనివాస్​గౌడ్

ABOUT THE AUTHOR

...view details