'ఇకనైనా తాగు నీరందించకుంటే ఉద్యమం మరింత తీవ్రం' - COLLECTORATE
తమ కాలనీలకు తాగునీరు సరఫరా చేయట్లేదని సీపీఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శివారు కాలనీల్లోని ఇంటింటికీ తాగునీరు అందించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని గాంధీ పార్క్ నుంచి పాలనాధికారి కార్యాలయం వరకు మహిళలు ఖాళీ బిందెలతో,పురుషులు మంచినీళ్ల సీసాలతో ర్యాలీగా తరలివచ్చారు. 2018 డిసెంబర్ నాటికే ఇంటింటికీ మంచినీరు అందించాకే, ఓట్లు అడుగుతానన్న కేసీఆర్ మధ్యంతర ఎన్నికలు నిర్వహించారని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసి ఆరు నెలలు కావొస్తున్నా తాగునీరు మాత్రం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.