ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజులుగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. రహదారులన్నీ జలమయంగా మారాయి. రైతులంతా వ్యవసాయ పనులలో మునిగిపోయారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన గంగారం, కొత్తగూడ, గార్ల, బయ్యారం, గూడూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం - మహబూబాబాద్ న్యూస్
ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజులుగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
మహబూబాబాద్, కేసముద్రం, నెల్లికుదురు, కురవి, డోర్నకల్, మరిపెడ, నరసింహులపేట మండలాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. పాకాల వాగు చెక్ డ్యాంపై నుంచి పొంగి ప్రవహిస్తుండడం, బందం వాగు వల్ల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే రహదారిలో తాళ్ల సంకీస వద్ద కల్వర్టుపై నుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని 1,560 చెరువులలో 90 శాతానికి పైగా చెరువులు అలుగులు పోస్తున్నాయి. జిల్లాలో పెద్ద చెరువులైన బయ్యారం, గార్ల చెరువులు నిండుకుండలా మారాయి.