సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి విద్యార్థిని మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చింతోని గుంపు వాటర్ ఫాల్స్ వద్ద చోటుచేసుకుంది. బయ్యారం మండల కేంద్రానికి చెందిన అంబటి సతీష్, శ్రీవిద్య దంపతులు, కూతురు శివాని, కుమారుడు శివాజీలు ద్విచక్ర వాహనాలపై కుటుంబ సభ్యులతో కలిసి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న చింతోని గుంపు వద్ద ఉన్న జలపాతం వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఫొటోలు దిగి సరదాగా గడిపారు.
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా... జలపాతంలో పడి విద్యార్థిని మృతి - ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
జలపాతం వద్ద సెల్ఫీ దిగాలనే సరదా ప్రాణాలు తీసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చింతోని గుంపు జలపాతం వద్ద సెల్ఫీ దిగుతూ విద్యార్థిని ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతైంది. సుమారు 4 నుంచి 5 గంటల పాటు వెతకగా విద్యార్థి మృతదేహం లభ్యమైంది.
తిరిగి ఇంటికి వచ్చే సమయంలో శివాని సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయింది. సమాచారం అందుకున్న బయ్యారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 4 నుంచి 5 గంటల పాటు వెతకగా శివాని మృతదేహం లభ్యమైంది. శివాని యానిమల్ హజ్బెండరీలో డిప్లొమా చేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వర్షాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరూ జలపాతాల వద్దకు రావద్దని ప్రజలకు బయ్యారం సీఐ తిరుపతి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:భర్త మరణ వార్త విన్న భార్య అక్కడికక్కడే మృతి