గ్యాస్ సిలిండర్ బాంబు - cylender
రాష్ట్రంలో పలుచోట్ల వంట గ్యాస్ సిలిండర్లు పేలి ప్రజలను భయపెడుతున్నాయి. నాలుగు నెలల్లో మూడు చోట్ల సిలిండర్లు పేలాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో గ్యాస్ ప్రమాదం సంభవించింది.
గ్యాస్ పేలుడు
మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేట గ్యామా గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసె దగ్ధమైంది. భూక్య నారయ్య ఇంట్లో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. గుడిసెలోని వంట సామగ్రి, ధాన్యం బస్తాలు, దుస్తులు కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో లక్ష రూపాయల మేర ఆస్తినష్టపోయినట్లు బాధిత కుంటుబ సభ్యులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.