మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పాండ్యా తండాకు చెందిన గుగులోత్ సుదర్శన్ అనే రైతు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు. తన 1.32 ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకం అందించాలని ఆందోళన చేశాడు. నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా...పట్టించుకోవడం లేదంటూ ఆర్డీవో ఈశ్వరయ్యకు విన్నవించాడు. పక్షంరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో రైతు నిరసనను విరమించాడు.
ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు నిరసన - గుగులోత్ సుదర్శన్
పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని కోరుతూ ఓ రైతు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు. చొక్కా విప్పి తన నిరసన వ్యక్తం చేశాడు.
ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు నిరసన