తెలంగాణ

telangana

ETV Bharat / state

'అర్హులందరికీ రెండు పడక గదుల ఇళ్లు ఇస్తాం'

మహబూబాబాద్ జిల్లా తానంచర్లలో రూ.1.20కోట్ల వ్యయంతో నిర్మించిన 21 రెండు పడక గదుల ఇళ్లను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రారంభించారు. అనంతరం అనేపురం వద్ద ఎస్సారెస్పీ జలాలకు పూజలు నిర్వహించారు.

'అర్హులందరికీ రెండు పడక గదుల ఇళ్లు ఇస్తాం'

By

Published : Nov 6, 2019, 7:59 PM IST

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తానంచర్లలో రూ.1.20 కోట్లతో నిర్మించిన 21 రెండు పడక గదుల ఇళ్లను ఆయన ప్రారంభించారు. గ్రామ శివారులోని బొత్తలతండాలో రూ.1.75 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 35 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అర్హులైన వారందరికి ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయనుందన్నారు. ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోన్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియడారు.

'అర్హులందరికీ రెండు పడక గదుల ఇళ్లు ఇస్తాం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details