తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదీ అధికారంలోకి రావాలని సైకిల్​ యాత్ర - government

దేశంలో భాజపా మళ్లీ ఆధికారంలోకి రావాలని ఓ వ్యక్తి సైకిల్​ యాత్ర చేపట్టాడు. 17 జిల్లాల్లో 1,600 కిలోమీటర్లు ప్రయాణించి మోదీని మళ్లీ ప్రధానిని చేయాలని ప్రచారం చేశాడు. ఏప్రిల్​ 5న యాత్రను ముగిస్తానని తెలిపాడు.

భాజపాను గెలిపించాలని సైకిల్​ యాత్ర

By

Published : Mar 30, 2019, 8:49 AM IST

భాజపాను గెలిపించాలని సైకిల్​ యాత్
మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామానికి చెందిన రాయిండ్ల రవికుమార్ అనే వ్యక్తి సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర మహబూబాబాద్ జిల్లా మరిపెడ మీదుగా దంతాలపల్లికి చేరుకుంది. ఈయనకు స్థానిక భాజపా నేతలు స్వాగతం పలికారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మీదుగా పర్యటించి ఇక్కడికి చేరుకున్నాడు. ప్రతిరోజు సైకిల్​పై కొంతమేర ప్రయాణిస్తూ సేద చేరుతున్నట్లు తెలిపారు. 17 జిల్లాల్లో ఈ యాత్రను పూర్తి చేసి సుమారు 1,600 కిలోమీటర్ల ప్రయాణించినట్లు చెప్పారు. భాజపా తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు యాత్రను ముగించనున్నట్లు ఆయన తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details